Skip to main content

Posts

Showing posts from July, 2022

ఒక రూపాయి బియ్యం పధకం రైతులపాలిట శాపము!

ఒక రూపాయి బియ్యం పధకం రైతులపాలిట శాపము! రైతులు ఒక ప్రక్క మా ధాన్యాన్ని కొనండని అడుగుతుంటే, వారికే ఒక రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు! దళారీలకి, మిల్లర్లకి, కొంతమంది అధికార అనధికార ప్రముఖులకు 24 రూపాయిల లాభం కోసమేనా ఈ పధకం? ప్రభుత్వం కిలో 40 రూపాయలకు బియ్యాన్ని మిల్లర్ల నుండి కొంటుంది. రైతు తనకిచ్చిన ఒక రూపాయి కిలో బియ్యాన్ని 14/15 రూపాయలకు దళారీకి అమ్మేస్తాడు. Rs.13/14 రూపాయలు లాభం అనుకుంటాడు. తను పండించిన బియ్యం తింటాడు. దళారీ ఈ  బియ్యాన్ని మార్కెట్ లో 37/38 రూపాయలకు అమ్ముకుంటాడు. కిలోకి 24 రూపాయల లాభము. ఈ  బియ్యమే మళ్ళీ ప్రభుత్వానికి కిలో 40 రూపాయలకి అమ్ముతున్నాడేమో! అంతిమంగా రైతు తను పండించిన బియ్యాన్ని మార్కెట్లో అమ్మలేకపోతున్నాడు! ఒక రూపాయి బియ్యాన్ని కొన్న దళారీ రైతు కంటే తక్కువ కి మార్కెట్లో సప్లై  చేస్తున్నాడు. మరీ విషయము ప్రభుత్వానికి తెలియదా? లేకా కావాలనే  ఊరుకుంటున్నారా? ఉత్తరాంధ్ర పార్టీ రైతులకు  బియ్యానికి బదులు ఎరువులు గాని ఇతరత్రా సాయం చేస్తుంది. భూమి లేని వారికి మాత్రమే బియ్యం పధకం  అమలు  చేస్తాది. ఓ రైతా! తెలుసుకో! నీ  భవిషత్ బాగుం...