Skip to main content

Posts

Showing posts from February, 2023

UttarAndhra Party to support Independent candidate in Graduate MLC election

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra పట్టభద్రుల MLC ఎన్నికల గురించి నిన్న శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర పార్టీ నాయకుల సమావేశంలో చర్చ జరిగింది. A meeting of UttarAndhra Party leaders took place yesterday to discuss the Graduate MLC election. స్వతంత్ర అభ్యర్థులకు 1,2,3,4,   n ఇచ్చి, పార్టీ అఫిలియేషన్ వున్న వారికి ఎటువంటి మద్దత్తు ఇవ్వరాదని ప్రాధమికంగా నిర్ణయించడమైనది. It has been decided in principle to support independent candidates and not to give any preference to contestants affiliated with existing political parties. మొదటి, రెండు, మూడు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించబడును. To whom to give first, second, and third preference votes will be decided in the extended meeting of party leaders. పార్టీ విస్తృత సమావేశం రేపు (2/3/2023) విశాఖపట్నంలో జరుగును. The extended Party meeting will take place tomorrow (2/3/2023) at Visakhapatnam. జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra!

ANNOUNCEMENT: Formation of a new political party in the name and style "UttarAndhra Party"

25/02/2024 ప్రచురణార్దం Press Release  "ఉత్తరాంధ్ర పార్టీ " అనే కొత్త రాజకీయ పార్టీని  స్థాపించామని తెలియజేయుటకు మేము సంతోషిస్తున్నాం. We are pleased to announce the formation of a new political party in the name and style "UttarAndhra Party". ఉత్తరాంధ్ర పార్టీ ముందుగా మునుపటి  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం రాజ్యాంగభద్దమైన కార్యక్రమాలు చేబడుతుంది. UttarAndhra Party will initially carry activities in ghe erstwhile districts of Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari for the overall development of the area following constitutional principles. వ్యక్తిగత గౌరవనికి ఉత్తరాంధ్ర పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది మరియు సమాజంలో అట్టడుగునున్న పేదవారి కోసం పని చేస్తుంది. UttarAndhra Party gives highest priority to personal dignity of individuals and work for the upliftment of the poorest sections of the society. రాజకీయ, ఆర్ధిక, మరియు సామాజిక అభివృద్ధి సాధించడానికి పైన పేర్కొన్న జిల్లాలతో

2025 నాటికి ఉత్తరాంధ్ర రాష్ట్ర సాకారం అవుతుంది. UttarAndhra state will be formed by 2025

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! 2025 నాటికి ఉత్తరాంధ్ర రాష్ట్ర సాకారం అవుతుంది. UttarAndhra state will be formed by 2025. ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం చేస్తున్నాము. We are building UttarAndhra Party.  ఉద్యోగ కల్పనకోసం ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని యువత నినదిస్తున్నారు. Youth want UttarAndhra state for providing jobs. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని వివిధ సామజిక వర్గ సంఘాలు కోరుతున్నాయి. Some Social Group Associations are demanding UttarAndhra State. ఉత్తరాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా వైజాగ్ ని అతి తక్కువ ఖర్చుతో చెయ్యడం జరుగుతుంది. With limited expenditure Vizag can be made capital of UttarAndhra state. అమరావతి కి అయ్యే ఖర్చుతో ఉత్తరాంధ్ర మొత్తాన్ని అభివృద్ధి చెయ్యొచ్చు. With the amount required to build Amaravati whole of UttarAndhra can be developed. ఉత్తరాంధ్రకున్న 450 కిలోమీటర్ల తీరరేఖ చాలా దేశాలకు లేదు. Many countries do not have the 450 km sea coast of UttarAndhra. గోదావరి నీటితో వ్యవసాయాభివృద్ధి, పర్వత/అటవీ ప్రాంతాల్లో పర్యాటకం,  సముద్ర తీరంలో అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించే వివిధ

అధికారం/అహంకారమే ఆంధ్రప్రదేశ్ లో అధికార మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీల విధానం

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! అధికారం/అహంకారమే ఆంధ్రప్రదేశ్ లో అధికార మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీల విధానం. Power and Arrogance are hall mark of ruling and principal opposition parties in Andhra Pradesh. స్థానిక సంస్థల నిర్వర్యం ద్వారా స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్వయం చేయడం వీరి ఎత్తుగడ. Undermining local leadership by undermining local bodies is their tactic. వీరు వైరం (రాజకీయ) వున్నట్లు పైకి ప్రదర్శిస్తారు. కానీ తెర వెనుక కూడబలుక్కుంటారు. They con fights (political) publicly  but coordinate privately. అధికారం కోసం అన్ని అడ్డదార్లు తొక్కుతారు. ప్రజలను కులాల వారీగా విడదీస్తారు. ధన బలం, కండ బలం ప్రదర్శనకి వెనుకాడరు.  Resort to any means for power. Divide people on caste basis. Never hesitate to use money and muscle power. అడ్డు వస్తుందని అధికార పార్టీ కౌన్సిల్ని రద్దు చెయ్యాలని చూసింది. ప్రతి పక్షం అధికారులను బెదిరిస్తుంది. To get rid of scrutiny in Council, ruling party tried to abolish it. Opposition party threatens goverment officials. ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ఉత్త

రాయలసీమ పార్టీలు రాష్ట్ర ప్రజలను కులాలుగా విభజించి అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడిచారు

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! రాయలసీమ పార్టీలు రాష్ట్ర ప్రజలను కులాలుగా విభజించి అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడిచారు. Rayalaseema Parties have undermined Ambedkar ideals by dividing people into different castes. కులంకొక కార్పొరేషన్ పెట్టి కులరహిత సమాజ స్థాపనకి అడ్డు పడ్డారు. వారి పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టారే కానీ సామాన్య ప్రజలకు వాటివల్ల ఏమీ ఒరగలేదు. By creating separate corporations for each caste they prevented the emergence of a casteless society. They created posts for their party leaders but of no use to common people. గత 8-9 సంవత్సరాల కాలంలో ఈ పార్టీల పబ్బం కోసం సమాజాన్ని విభజించారు. నిధులు అంతంత మాత్రమే కేటాయించి సామాన్య ప్రజలను మభ్యపెట్టారు. For the last 8-9 years, these parties have divided society for their benefit. They misled people by allocating paltry funds. కొంతమంది వారి పార్టీ వారికి పదవులు కట్టబెట్టి సామజిక న్యాయమని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. By giving some positions to their party leaders these parties claim that they have done social justice. సామజిక న్య

India needs a Second National Capital

Metta Rama Rao, IRS (vrs) Former Principle Commissioner Customs & CGST  India needs a Second National Capital till a green field New National Capital is built in the geographical centre of India. Dr B R Ambedkar in his book "Thoughts on Linguistic States" published in 1955 has written a full Chaper on "Second Capital for India" While discussing at length justfying the need to go for a second capital has clearly preferred Hyderabad over Kolkata and Mumbai. He did not consider Nagpur. Main reason he brought out in his book is the need to bridge north and south of the country. He recommended Hyderabad as second capital of India. Why we should consider Dr Ambedkar's recommendation: Delhi was central to British India. After partition, Delhi is situated at one corner of India. People from South find it daunting to visit due to distance, weather, language, culture, etc. If Hyderabad is made second capital, it will embrace all southern states. People of South India

ఉత్తరాంధ్ర పార్టీ పరిపాలనా విధానం (ముసాయిదా)

ఉత్తరాంధ్ర పార్టీ పరిపాలనా విధానం (ముసాయిదా) 1. పాత నాలుగు జిల్లాల్లో వున్న అన్ని పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా పునరవ్యవస్తీకరణ. మండల తసీల్దార్లు జిల్లా కలెక్టర్ కి డైరెక్ట్ గా  రిపోర్ట్ చేస్తారు. 2. వ్యవసాయ భూమికి సంబందించిన అన్ని లావాదేవీలు మండల తాసిల్దార్ కార్యాలయంలో జరుగును. మిగతా ఆస్తుల లావాదేవీలు రిజిస్ట్రేషన్ విభాగం చూసుకొంటుంది. 3. ప్రతి లక్ష మంది ప్రజలకు 333 మంది పోలీసుల నియామకం. 4. బంగళాలకు స్వస్తి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సామాన్యుల్లా  ఫ్లాట్ల లో వుంటారు. 5. పాత పెన్షన్ విధానము పునరుద్దరణ  (కొన్ని మార్పులతో ) 6. అవినీతి కట్టడి కోసం సత్వర చర్యలు. 7. ప్రభుత్వ విభాగల్లో వున్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీ. ♦️ ఉత్తరాంధ్ర పార్టీ విద్యా విధానం (ముసాయిదా) అంగన్వాడీ నుండి 12 వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందరికీ ఉచితంగా. ఈ విభాగంలో వున్న ప్రైవేట్ విద్యాలయాల రద్దు. సంస్థలకు, వాట్లో పని చేసే వారికి తగు ఉపశమన చర్యలు. డిగ్రీ మరియు పీజీ చదివేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో సౌకర్యం. పేద విద్యార్థులకు తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం. 📌ఉత్తరాంధ్ర లో రీసెర్చ్ కి పెద్దపీట. ♦️  ఉత్త

ఉత్తరాంధ్ర పార్టీ వుండగా, రాయలసీమ పార్టీలు దండగే కదా!

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఇక మాకొద్దీ రాయలసీమ పార్టీలు!  Now we do not want these Rayalaseema Parties! రాయలసీమ నాయకత్వంలోని పార్టీలు 24 గంటలు రాజకీయం చేస్తున్నాయి. Political parties under Rayalaseema leadership are politicking 24 hours. ఈ పార్టీలు గ్రామాల్ని నిట్టనిలువునా  చీల్చినాయి. ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టి వారి అధికార దాహం కోసం ప్రజల్ని సమిధల్ని చేస్తున్నాయి. These Parties have vertically divided the villages. Uttarandhra people have been misled to be used for their power games. వీరు ఉత్తరాంధ్రని అభివృద్ధికి ఆమడ దూరంలో వుంచారు. They have denied development to UttarAndhra. మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, వలసలు తగ్గాలన్నా ఉత్తరాంధ్ర నాయకత్వం రావాలి. త్వరలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రజల్లోకి వస్తోంది. కొత్త బాటలు వేస్తోంది. UttarAndhra leadership is needed to develop UttarAndhra and reduce migration. UttarAndhra Party is coming into public soon. It will lay new paths. ఉత్తరాంధ్ర పార్టీ వుండగా,  రాయలసీమ పార్టీలు దండగే కదా! మనం స్వంత ఇల్లు కట్టాక అద్దె ఇల్లు ఎందుకు? Why you need

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics Leaving IRS mid Feb 2019 was a decision of both my heart and mind! Village in me never left despite my 37 years stay in towns and big cities. Over time, villages turned poor. Depleted of their dynamism, villages have become dull. Agriculture remained stagnant. People and governments invested less and less in villages and agriculture to create avenues for employment to rural people. Born there, I felt it as my duty to do something for rural areas that are close to my heart. My MPA study at LKY School (NUS) in 2010-11 helped me understand my potential. My study of Singapore Public Administration and it's growth story encouraged me to do some thing for India, least for my native area, UttarAndhra! Scope to carry heart's work as bureaucrat is limited. As bureaucrat I was focussed on work given. I had a choice between a steady career growth for 7 years vs uncertain new politic

ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం జరుగుతుంది

జై ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం లో కార్యాలయాలు మొదలైనాయి. ఈ నెలలో కాకినాడలో కూడా కార్యాలయం మొదలవుతుంది. ఉత్తరాంధ్ర పార్టీ ఆవిర్భావ సభ ఫిబ్రవరి 2023 లో విశాఖపట్నం లో జరుగుతుంది. పార్టీ రాజ్యాంగం ఆమోదం, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కొశాధికారుల ఎన్నిక జరుగుతుంది. పార్టీ అధికారిక కార్యక్రమాలు మొదలు పెడుతుంది. 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వున్న 53 MLA మరియు 8 MP స్థానాల్లో పోటీ చేస్తాం. 1983 NTR గారి  స్ఫూర్తితో  అన్ని స్థానాలు గెలుస్తాం. ఎన్నికల్లోగా ఐదు యాత్రలు చేస్తాము. 1. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర 2. గోదావరి నీటి యాత్ర  3. విశాఖ ఉక్కు ప్రజా హక్కు యాత్ర 4. వైజాగ్ రైలు జోన్ &  డివిజన్ యాత్ర 5.ఉత్తరాంధ్ర రాష్ట్ర జైత్ర యాత్ర మీ ఆశీస్సులు ఇవ్వండి! జై ఉత్తరాంధ్ర! జై జై ఉత్తరాంధ్ర!! మీ మెట్ట రామారావు కన్వీనర్ ఉత్తరాంధ్ర పార్టీ 9560583885