ఉత్తరాంధ్ర పార్టీ పరిపాలనా విధానం (ముసాయిదా)
1. పాత నాలుగు జిల్లాల్లో వున్న అన్ని పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా పునరవ్యవస్తీకరణ. మండల తసీల్దార్లు జిల్లా కలెక్టర్ కి డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు.
2. వ్యవసాయ భూమికి సంబందించిన అన్ని లావాదేవీలు మండల తాసిల్దార్ కార్యాలయంలో జరుగును. మిగతా ఆస్తుల లావాదేవీలు రిజిస్ట్రేషన్ విభాగం చూసుకొంటుంది.
3. ప్రతి లక్ష మంది ప్రజలకు 333 మంది పోలీసుల నియామకం.
4. బంగళాలకు స్వస్తి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సామాన్యుల్లా ఫ్లాట్ల లో వుంటారు.
5. పాత పెన్షన్ విధానము పునరుద్దరణ (కొన్ని మార్పులతో )
6. అవినీతి కట్టడి కోసం సత్వర చర్యలు.
7. ప్రభుత్వ విభాగల్లో వున్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీ.
♦️ ఉత్తరాంధ్ర పార్టీ విద్యా విధానం (ముసాయిదా)
అంగన్వాడీ నుండి 12 వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందరికీ ఉచితంగా. ఈ విభాగంలో వున్న ప్రైవేట్ విద్యాలయాల రద్దు. సంస్థలకు, వాట్లో పని చేసే వారికి తగు ఉపశమన చర్యలు.
డిగ్రీ మరియు పీజీ చదివేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో సౌకర్యం. పేద విద్యార్థులకు తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం.
📌ఉత్తరాంధ్ర లో రీసెర్చ్ కి పెద్దపీట.
♦️ ఉత్తరాంధ్ర పార్టీ ఆరోగ్య విధానం (ముసాయిదా)
ఉత్తరాంధ్ర పార్టీ ఆరోగ్యాన్ని ప్రాధమిక హక్కుగా (జీవించే హక్కు) భావిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలు ఉచితంగా అందించబడును. వైద్యుల, వైద్య సిబ్బంది సంఖ్యను మరియు ఆరోగ్య శాఖ బడ్జెట్ గణనీయంగా పెంపు.
♦️ ఉత్తరాంధ్ర రాష్ట్ర వ్యవసాయ విధానం (ముసాయిదా)
ఉత్తరాంధ్ర ప్రభుత్వం రైతులు మరియు భూ యజమానులు వ్యవసాయం చేయుటకు వీలుగా వ్యవసాయ విభాగం పర్యవేక్షణలో ప్రభుత్వ సంస్థల ద్వారా దున్నడం, కొయ్యడం, నూర్చడం మొ. పనులు చేయుట, విత్తనాలు, ఎరువులు, కలుపు, తెగులు నివారణ మందులు, సాగు నీటి సప్లై మొ. చేయడం జరుగుతుంది. పంట ప్రభుత్వ సంస్థ కొని పైన చేసిన పనులకు ఖర్చు మినహాహించుకొని మిగతా దాన్ని రైతు/భూ యజమానులకు చెల్లిస్తుంది. కూలీలకు కూలీ కూడా ప్రభుత్వ సంస్థ చెల్లించి రైతు పంట నుండి మినహాయించుకుంటుంది. రైతు వ్యవసాయ యాజమాన్యం చూసుకుంటే సరిపోతుంది.
♦️ఉత్తరాంధ్ర పార్టీ పారిశ్రామిక విధానం (ముసాయిదా)
ఉత్తరాంధ్ర ప్రజలకు ఉద్యోగ కల్పన కోసం ఉత్తరాంధ్ర పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహకాల నిమిత్తం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5000 కోట్ల రూపాయిల కేటాయింపు. జిల్లా పారిశ్రామిక కేంద్రాలను బలోపేతం చేయడం. వ్యవసాయ మరియు ఉద్యాన పంటల, సముద్ర ఉత్పత్తుల నిలువ మరియు ప్రాసెసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చెయ్యడం. పారిశ్రామీకరణ విభాగలాన్నింటికీ ఒకే మంత్రిత్వాశాఖ. పరిశ్రమలకు విద్యాలయాలకు వారధి ఏర్పాటు.
జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్రని 2035 నాటికి శాంతి,సౌభాగ్యం మరియు సంతోషాలకు నిలయంగా మార్చే దూరదృష్టితో ఉత్తరాంధ్ర పార్టీ పనిచేస్తుంది. 2045 నాటికి ఉత్తరాంధ్ర పెట్టుబడులకు, పర్యాటకానికి, ఉద్యోగకల్పనకి, ఆవాసానికి ప్రపంచంలోనే ఆకర్షణీయమైన ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఉత్తరాంధ్ర పార్టీ కట్టుబడి ఉంది.
🔴 రాయలసీమ పార్టీల పాలన విధానం
దొంగల పాలన; ఒక పాలనా వ్యవస్థ, దాని అధికారులు మరియు పాలక వర్గం సాధారణంగా వ్యక్తిగత సంపద మరియు రాజకీయ అధికారాన్ని విస్తృత జనాభా ఖర్చుతో కొనసాగిస్తుంది. కఠినమైన పరంగా క్లెప్టోక్రసీ అనేది ప్రభుత్వ రూపం కాదు కానీ అలాంటి ప్రవర్తనలో నిమగ్నమైన ప్రభుత్వ లక్షణం
అత్యంత విజయవంతమైన క్లెప్టోక్రసీలు అంటే, ఇంటిని ఖాళీగా ఉంచకుండా, దానిని ఆక్రమించి, ఇంటి యజమానికి 'అద్దె' చెల్లిస్తూ ఇంటిలోని ఇతర సభ్యులు తమ స్వంత ఆదాయాన్ని సంపాదించుకునేలా అనుమతించడం - గాడ్‌ఫాదర్ లాంటి రాష్ట్రాధిపతి.
ఉత్తరాంధ్ర పార్టీ అభివృద్ధి నమూనా (ముసాయిదా)
♦️ ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని మూడు జోన్లగా విభజన.
సముద్ర తీరం - బ్లూ ఎకానమీ - మత్స్య సంపద, విహార/పర్యాటక రంగం, సముద్ర యానం, సినిమా పరిశ్రమ, మొ.
పర్వత /అటవీ ప్రాంతం - గ్రీన్ ఎకానమీ - పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వ్యవసాయ రంగం, విహార/పర్యాటక రంగం, సినిమా పరిశ్రమ, విద్యాలయాలు, వైద్య రంగం, సేవా రంగం, మొ.
మైదాన ప్రాంతం - రెడ్ ఎకానమీ - వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, సేవా రంగం, రవాణా రంగం, మొ.
UttarAndhra Party draft Development Model
Comments
Post a Comment