జై ఉత్తరాంధ్ర! అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని 294 శాసనసభ స్థానాల్లో ఉత్తరాంధ్రకి 58 స్థానాలుండేవి. అవి తూర్పుగోదావరిలో 23, విశాఖపట్నంలో 13, విజయనగరంలో 10 మరియు శ్రీకాకుళంలో 12. ఇప్పుడు అదే నాలుగు జిల్లాల్లో 53 శాసనసభ స్థానాలున్నాయి. తూర్పుగోదావరిలో 19, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 9 మరియు శ్రీకాకుళంలో 10. విశాఖపట్నం జిల్లాకి రెండు శాసనసభ స్థానాలు పెరిగితే ఇద్దరు MLA లు ఒక MP గత రెండు దశాబ్దాలుగా స్థానికేతరులే! కొన్ని దశాబ్దాలగా ఉత్తరాంధ్ర రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొల్లగొట్టారు. అన్నింటి కంటే ఎక్కువగా నష్టపోయింది తూర్పుగోదావరి జిల్లా. నాలుగు శాసనసభ స్థానాలను పోగొట్టుకొంది. తరువాత శ్రీకాకుళం మరియు విజయనగరం ప్రాధాన్యతని కోల్పోయాయి. ఉత్తరాంధ్రకి ఎవరు అన్యాయం చేశారు? ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ మరియు తెలుగు దేశం పార్టీలా? రాయలసీమ నాయకులా? దద్దమ్మల్లాంటి ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులా? కిమ్మనుకొని అడగకుండా వున్న ప్రజలా? లేకా అందరూ భాగస్వామ్యూలా? ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధనద్వారా 75 శాసనసభ స్థానాలు వస్తాయి. ఉత్తరాంధ్రలో ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుంది. జైజై ఉత్తరాంధ్ర!!
Support statehood for UttarAndhra, the resource-rich dirt-poor neglected part of the Telugu region.