జై ఉత్తరాంధ్ర!
వివిధ పార్టీల్లో వున్న నాయకులు ఉత్తరాంధ్ర ప్రజల్లో వున్న ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ నేతలే శరణ్యమన్న బానిస బాష మాట్లాడుతున్నారు. వారికి తెలిసే చేస్తున్నారా, లేకా పదవీ వ్యామోహంలో తెలియక చేస్తున్నారో తెలియడం లేదు.
ఉత్తరాంధ్ర పార్టీ
ఉత్తరాంధ్ర ఉనికి కోసం,
ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం,
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం
నిరంతరం పని చేస్తుంది.
ఉత్తరాంధ్ర ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇక్కడ వున్న అపార వనరులను ఇప్పటికే చాలా దోసేశారు. మిగిలిన వాటిని ఉత్తరాంధ్ర ప్రజలకోసం కాపాడే బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలందరిదీ. ఉత్తరాంధ్ర నాయకులు రాయలసీమ పార్టీల జెండాలు వదిలి ఉత్తరాంధ్ర కోసం పాటుపడాల్సిన సమయమిదే.
రండి, ఉత్తరాంధ్ర కోసం పని చేద్దాం. మాతృభూమి ఋణం తీర్చకుందాం.
జై జై ఉత్తరాంధ్ర!
Comments
Post a Comment