జై ఉత్తరాంధ్ర!
మనకెందుకీ రాయలసీమ నేతలు?
గోదావరి నీరు మనకివ్వకుండా పట్టిసీమ ద్వారా వాళ్ళ ప్రాంతానికి పట్టికెళ్లిన CBN ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు.
ఆంధ్ర రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పుడు కర్నూల్ నుండి అతి పెద్ద నగరం హైదరాబాద్ ని రాజధాని చేశాము. 2014 లో విడిపోయినప్పుడు పెద్ద నగరమైన విశాఖపట్నంని విస్మరించి మనకి అన్యాయం చేశారు.
ఇప్పటి ప్రభుత్వం కూడా రాయలసీమ మీద వున్న శ్రద్దలో 10% కూడా మన మీద లేదు. వైస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు మంజూరు చెయ్యకుండా రైతుల మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు.
శ్రీకాకుళం -ఆమదాలవలస రోడ్ దీన పరిస్థితికి
ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతకి
శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించక స్థానిక సంస్థల నిర్వీర్యం చెయ్యడంలో
వంశధార మీద ప్రాజెక్టుల జాప్యంకు
ఆగని వలస కూలీల పరంపరకి
విశాఖపట్నం కి గోదావరి నీటిని త్రాగు నీరుగా అందివ్వడంలో వైఫల్యంకి
ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి మరియు వైద్య సదుపాయాల లేమికి
ఉత్తరాంధ్ర ప్రాతినిధ్యాన్ని కైవసం చేసుకోవడంలో మరియు జిల్లాల విభజనలో ఇచ్చాపురం ప్రజలకు జరిగిన అన్యాయంలో పూర్తి బాధ్యత TDP, YCP లదే.
CBN మరియు YSJR దొందూ దొందూ ఒకటే. ఉత్తరాంధ్ర ద్రోహులు. వచ్చే ఎన్నికల్లో వీరిని వీరి పార్టీ అభ్యర్థులను ఉత్తరాంధ్ర లో చిత్తుగా ఓడిద్దాం.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment