PDS రైస్ మీద ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం :3840 కోట్లు ప్రతి ఏడాది ఆదా చెయ్యడానికి అవకాశం. "గౌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారించి వ్రాయునది. ఆర్యా! విషయం: PDS ద్వారా రైతులకు బియ్యం - సాలీన 3840 కోట్ల రూపాయల ఆదా - సంబందించి ఉత్తరాంధ్ర (గోదావరి మరియు బహుదా నదుల మధ్య ప్రాంతం) అభివృద్ధి కోసం పనిచేయడానికి నేను 2019 లో నా ఐఆర్ఎస్ ఉద్యోగం నుండి వీఆర్ తీసుకున్నాను. నేను శ్రీకాకుళం (జన సేన 2019), విశాఖపట్నం (స్వతంత్ర 2024) పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేశాను. నేను శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించి, మొదటి పదిహేను సంవత్సరాలు అక్కడే గడిపాను. తరువాత నేను సివిల్ సర్వీస్ ఉద్యోగ వ్యవధిలో ప్రతి సంవత్సరం 3-4 సార్లు నా కుటుంబంతో కలిసి గ్రామాన్ని సందర్శించేవాడిని. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మా గ్రామంలో వున్నాను. ప్రజల సమస్యల గురించి తెలుసిన వ్యక్తిగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ను పునరుద్ధరించమని ఈ ఉత్తరం ద్వారా తమరిని అభ్యర్థిస్తున్నాను, ముఖ్యంగా పిడిఎస్ కింద రైతులకు బియ్యం పంపిణీ విషయం. 2. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ఈ దేశంలో లక్షలాది మందికి ఆహార ...
Support statehood for UttarAndhra, the resource-rich dirt-poor neglected part of the Telugu region.