1. పెళ్ళి/శుభ కార్యానికి ముహూర్తం పెట్టామని, పెళ్ళి చేశామని దగ్గర బంధువులు మరియు స్నేహితుల నిర్యాణం సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శ చెయ్యకపోవడం. కొత్త పోకడలు ఈ మధ్య వచ్చాయి. వీటికి శాస్త్ర ప్రామాణికం లేదు. హేతుభద్దత అసలే లేదు. ఈ పోకడను ప్రజలు వదిలివేసి తమ బంధు, మిత్రుల కష్ట కాలంలో పాలు పంచుకోవాలి. మరణం మనిషి జీవితానికి ఆఖరి మజిలీ. నిత్య సత్యం. దేవుని నిర్ణయం అని ఎక్కవ మంది నమ్ముతారు. మరి అటువంటి సత్యాన్ని, దైవ ఆజ్ఞను అశుభం ఎలా అనుకుంటాం. పుట్టుక, చావు రెండు ఒకే నాణానికి రెండు వైపులు. 2. చావు పరామర్శకు ఆదివారం వెళ్ళకూడదట! ఎందుకు అంటే కారణం చెప్పరు. హేతుబద్దత తెలియజేయరు. సెలవు దినం కాబట్టి అత్యంత సులువైన రోజు ఆదివారం.బంధు మిత్రులను వారి కష్ట కాలంలో కలవడానికి ముహూర్తం అవసరమా? 3. పరామర్శకు వెళ్తే స్నానం చెయ్యాలని ఇంటివరకు వచ్చి ఆప్తులను కలవని సందర్భాలు చూశాను. శవ యాత్రలో పాల్గొంటే స్నానం చెయ్యాలి. చాలా మంది వ్యక్తులు వుంటారు కనుక. ఇతర రోజుల్లో ఇంటికి వచ్చి పరామర్శ చేసేటప్పుడుస్నానం అవసరం ఏంటి? శానిటేషన్ బాగా వున్న ఈ రోజుల్లో అవసరమా? ఇప్పుడు షామియానాలు, కుర్చీలు, sealed water b...
Support statehood for UttarAndhra, the resource-rich dirt-poor neglected part of the Telugu region.