Skip to main content

ఉత్తరాంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పే పది కారణాలు

ఉత్తరాంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పే పది కారణాలు

1. ఐరోపా వలసవాదం రాకముందు వరకు గోదావరి నదికి ఉత్తరాన వున్న మన ప్రాంతం చారిత్రాత్మకంగా ఒక చైతన్యవంతమైన రాజకీయ ప్రాంతం. హైదరాబాద్ నిజాం మన ప్రాంతాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత మన పూర్వ స్థానానికి పునరుద్ధరించలేదు. దాంతో మనం ము ఆంధ్రలో భాగంగా మిగిలిపోయాము.

2. మన భాష, సంస్కృతి, మత ఆచారాలు ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటాయి. తెలుగు భాష మూలం మన నేల నుండే వచ్చింది. మన వస్త్రధారణ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చార్వాకులు, జైనమతం, బౌద్ధమతం మరియు హిందూమతం వర్ధిల్లాయి. మనము ప్రధాన దేవతలైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులను, అంటే త్రిమూర్తులను పూజిస్తాము మరియు మన ప్రాంతంలోనే ప్రత్యేకమైన త్రినాథ పూజను నిర్వహిస్తాము. ఇక్కడ ఆది (మొదటి నాలుగు) అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలున్నాయి. సూర్య భగవానుడి ఆరాధన ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు మన సంస్కృతి అణచివేయబడింది.

3. ఆగ్నేయాసియా మరియు రోమన్ సామ్రాజ్యంతో వర్ధిల్లిన విదేశీ వాణిజ్యం కారణంగా ఈ ప్రాంతం గొప్ప వారసత్వాన్ని కలిగినది. ఈ ప్రాంతంలో అనేక నదులు, సముద్ర తీరం మరియు దట్టమైన అడవులతో కూడిన తూర్పు కనుమలు వున్నాయి. ఇది ఒకప్పుడు భారతదేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా వుండేది. ప్రస్తుతం మనది బాగా వెనుకబడిన ప్రాంతం 

4. మన ప్రాంతం మద్రాసు మరియు కలకత్తా ప్రెసిడెన్సీ పట్టణాలకు మధ్య వుండేది, అంటే ఆ రెండు పట్టణాలకు చాలా దూరంగా వుండటంవల్ల పరిపాలన నిర్లక్ష్యంకు గురైంది. బ్రిటిష్ పాలన వల్ల వచ్చిన ఆధునీకరణ ప్రయోజనాలు కూడా ఇక్కడికి చేరలేదు.

5. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా మన ప్రాంతం రాష్ట్ర రాజధాని నగరానికి దూరంగానే వుండిపోయింది. అంతేకాకుండా, అన్ని మెట్రో నగరాలు మన ప్రాంతంకి 700 కిలోమీటర్లకు పై దూరంలో వుండటం కారణంగా స్వాతంత్ర్యంవల్ల లభించే అదనపు ప్రయోజనాలను మన ప్రాంతం పొందలేక పోయింది.

6. మన ప్రాంతంలో పనిచేయడానికి అధికారులకు ఆసక్తి చూపడం లేదనే సాకు చూపించి చాలా తక్కువ పోస్టులను మాత్రమే భర్తీ చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ప్రాంతం నిర్లక్ష్యంకి గురి అయ్యింది. విశాఖపట్నంకు ఉత్తరాన , ప్రభుత్వ అధికారులను నియమించడానికి మొత్తం ప్రాంతాన్ని "శిక్ష" ప్రాంతంగా పరిగణించారు.

7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని భూములకు నీరందించడానికి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించలేదు. అతివృష్టి, అనావృష్టి వర్షాల కారణంగా ప్రజలు గ్రామాలను విడిచిపెట్టి భారతదేశం నలుమూలల కూలీలుగా మారారు. ఇదే అదను చూసి గోదావరి నదికి దక్షిణాన ఉన్న తెలివైన వారు, మన భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకోవడం ద్వారా మన సామూహిక వలసలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వనరులపై మన హక్కులు కోల్పోవడం జరిగింది.

8. సామాన్య ప్రజలు వలస వెళ్ళిపోతుండగా, గోదావరికి దక్షిణాన ఉన్న నాయకులు ఈ ప్రాంతానికి వలస వచ్చి ప్రజా ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించారు. మన ప్రజా ప్రాతినిధ్యం మరియు రాజకీయ అధికారం ఇతరులకు బదిలీ.జరిగింది.

9. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 294 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఉత్తరాంధ్ర నుండి వుండేవారు. ఇప్పుడు కేవలం 53 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజలు మన ప్రాంతం నుండి వలస వెళ్లిపోయారు, దీనివల్ల మన ప్రాంతo రాజకీయ ప్రాధాన్యత కోల్పోతుంది..

10. గోదావరి నీటిలో మన వాటా, బడ్జెట్లలో మన వాటా, ప్రభుత్వ అధికారం మరియు ఉద్యోగాలలో మన వాటా తగ్గిపోయి, మన ప్రాంతం వెనుకబడినదిగా మరియు చౌక శ్రమ జీవుల పంపిణి కేంద్రంగా మారింది.

ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల నాయకుల ఆధిపత్యంతో ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిస్థాయి వలసరాజ్యంగా మారింది.

మన సంస్కృతిని, గుర్తింపును కాపాడుకోవడానికి మరియు మన భవిష్యత్తును మనమే రాసుకోవడానికి, విశాఖపట్నాన్ని రాజధానిగా రెండు కోట్ల మంది ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని మనము కోరుకుంటున్నాము. దానిని సాధించేందుకు 2007 లోనే సంకల్పం చేసుకున్నాము. ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధనకు 2019 నుండి ఉద్తృతంగా పని చేస్తున్నాము. 

మీ సహకారానికి ధన్యవాదములు.

Comments

Popular posts from this blog

India needs a Second National Capital

Metta Rama Rao, IRS (vrs) Former Principle Commissioner Customs & CGST  India needs a Second National Capital till a green field New National Capital is built in the geographical centre of India. Dr B R Ambedkar in his book "Thoughts on Linguistic States" published in 1955 has written a full Chaper on "Second Capital for India" While discussing at length justfying the need to go for a second capital has clearly preferred Hyderabad over Kolkata and Mumbai. He did not consider Nagpur. Main reason he brought out in his book is the need to bridge north and south of the country. He recommended Hyderabad as second capital of India. Why we should consider Dr Ambedkar's recommendation: Delhi was central to British India. After partition, Delhi is situated at one corner of India. People from South find it daunting to visit due to distance, weather, language, culture, etc. If Hyderabad is made second capital, it will embrace all southern states. People of South India ...

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics

Reflections of Shri Metta Rama Rao, Convenor UttarAndhra Party on competing 4 years in politics Leaving IRS mid Feb 2019 was a decision of both my heart and mind! Village in me never left despite my 37 years stay in towns and big cities. Over time, villages turned poor. Depleted of their dynamism, villages have become dull. Agriculture remained stagnant. People and governments invested less and less in villages and agriculture to create avenues for employment to rural people. Born there, I felt it as my duty to do something for rural areas that are close to my heart. My MPA study at LKY School (NUS) in 2010-11 helped me understand my potential. My study of Singapore Public Administration and it's growth story encouraged me to do some thing for India, least for my native area, UttarAndhra! Scope to carry heart's work as bureaucrat is limited. As bureaucrat I was focussed on work given. I had a choice between a steady career growth for 7 years vs uncertain new politic...

SEMINAR: Linguistic States to Administrative States- Way Forward

Background Note for National Seminar on  A. Formation of States post-independence At the time of Independence India had 552 Princely States and 9 British-administered areas. Sardar Patel persuaded most princely states to join India. In 1953, First States Reorganisation Commission (Faizl Ali Common) was set up. Based on its report 14 states and 6 UTs were formed. Later on more states were formed on a linguistic basis. The formation of Uttarakhand, Chattisgarh, Jharkhand, and Telangana has given impetus to the formation of states for development and administration as a yardstick. B. Clamour for smaller states There are demands for carving out new states across India. 1. Ladak (present UT) 2. Maru Pradesh (western Rajasthan) 3. Saurashtra (South Gujarat) 4. Konkan (Maharashtra) 5. Tulu Land (Karnataka) 6. Kodagu (Karnataka) 7. Kongunadu (Western Tamilnadu) 8. Rayalaseema (AP) 9. UttarAndhra (north AP) 10. Kosala Pradesh (western Odisha) 11. Bodoland (Assam) 12. Gorkhaland ...