మిత్రులకు జై ఉత్తరాంధ్ర!
నవంబర్ 1వ తేదీ అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం. ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు (1.10.1953) గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన (1.11.1956) తరువాత గాని జరిగిన మేలేమి లేదు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉత్తరాంధ్ర ప్రజలకు నష్టం జరిగింది. విశాఖపట్నం లోని ప్రభుత్వ భూములు అమ్మిన డబ్బుతో, ఉత్తరాంధ్ర వలస కూలీల శ్రమతో కట్టిన హైదరాబాద్ లో మన ప్రజలకున్న రిజర్వేషన్ సౌకర్యం తీసివేశారు. ఉత్తరాంధ్ర కి మొండి చెయ్యి చూపారు.
అన్ని రాజకీయ పార్టీలు, వారి ఆధ్వర్యంలో లోని ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతానికి అన్యాయం చేశాయి.
అందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ జరుపుకోడానికి మనకి కారణం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ఉత్సవాలకి దూరంగా వుండాలని మనవి.
జై ఉత్తరాంధ్ర!
Comments
Post a Comment