ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉత్తరాంధ్ర పార్టీ ఏర్పాటు కై 14 నవంబర్ న జరగనున్న మన ఉత్తరాంధ్ర పార్టీ మీటింగ్ కు సంబంధించి ముందస్తు సన్నాహక సమావేశం రోజు విశాఖపట్నంలోని పార్టీ ఆఫీసు నందు జరిగింది ఇందులో 15 మంది పాల్గొనడం జరిగింది ఉత్తరాంధ్ర రాజకీయ పార్టీ ఏర్పాటు, పార్టీ విధి విధానాలు, ప్రణాళిక, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సభ్యులకు ఉత్తరాంధ్ర వెనక బాటుతనం, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, రాష్ట్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనం, అభివృద్ధి మొదలైన విషయాలపై సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ మేధావులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సభ్యులందరూ ఏకగ్రీవంగా ఉత్తరాంధ్ర రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించారు....
Comments
Post a Comment