జై ఉత్తరాంధ్ర!
మన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దేముడికి మొక్కుతున్నాము కదా అని చదువుని అశ్రద్ధ చేస్తే మంచిఫలితం యివ్వడం ఆ దేవునికి కూడా సాధ్యం కాదు. నమ్మినా నమ్మపోయినా ఇది నిజం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన కేంద్రం చట్టపరంగా కొన్ని వాగ్దానాలను చేసింది. వాటన్నిటినీ ఎగ్గొడుతున్నా పట్టించుకోకుండా
మనం ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులు వాళ్ళలో వాళ్లు నిత్యం దెబ్బలడుకొంటూ, మన ఉత్తరాంధ్ర అభివృద్ధి ని పూర్తిగా మరచిపోయారు.
శోభ కృత నామ సంవత్సరం లో శుభం కలగాలని మనం లాంఛనంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు...
ఈ తెలుగు సంవత్సరాది సందర్భంగా నైనా ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏం చేస్తే కాపాడ బడతాయో ఆలోచించి చైన్యవంతులుగా ముందుకు కదలడానికి సిద్ధపడాలి..
అప్పుడే మనకు నిజమైన ఉగాది..
అభినందనలతో..
Comments
Post a Comment