జై ఉత్తరాంధ్ర!
రాయలసీమకి నీరు లేదని అంటారు! వాస్తవాలు చూస్తే గత 20 ఏళ్లగా ఒక్క కృష్ణ నది నుండే 56.57 టీఎంసీల నుండి 179 టీఎంసీల నీరు అందించారు. మరి ఉత్తరాంధ్ర లో అన్ని నదుల ద్వారా ఎంత నీరు అందించారు? 10 టీఎంసీ, 20 టీఎంసీ, 30 టీఎంసీ? ఉత్తరాంధ్ర లో పెద్ద ప్రాజెక్ట్ వంశధార! మరి 2022-23 లో దాని సామర్ధ్యం 8 టీఎంసీ నీరు.
ఉత్తరాంధ్ర వ్యవసాయం ఎందుకు కుంటుపడిందో, వలసలు ఎందుకు ఎక్కువవుతున్నాయో ఉత్తరాంధ్ర ప్రజలకు దీనిబట్టి అర్ధం అవ్వాలి. గోదావరి నీటిని ఉత్తరాంధ్ర కి ఇచ్చే బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని అశ్రద్ధ చేసిన రాయలసీమ నాయకత్వం లోని పార్టీలను ఓడిస్తే గానీ ఉత్తరాంధ్రకి పట్టిన శని వదలదు.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment