జై ఉత్తరాంధ్ర!
నిర్లక్ష్యపు నీడలో వున్న ఉత్తరాంధ్రని మోసం చేసింది 40 ఏళ్ల పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం ఒక కుటుంబానికి తాకట్టు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా త్రోసిరాజని కొత్త నగరం నిర్మించదలసి బోర్లా పడ్డారు.
మొదటినుండి అన్నింటినీ రాజకీయం చేసిన 11 ఏళ్ల పార్టీ పాలన చేతకాక ఓట్లను ఆకర్షించడంలో బిజీ బిజీ. మూడు రాజధానులని రాజకీయ క్రీడ చేశారు. బటన్ నొక్కడం తప్ప వేరే ప్రభుత్వ కార్యక్రమం లేదు.
అసలు పార్టీ నిర్మాణమే తెలియని ఇంకో పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దిక్కు తోచని స్థితిలో వుంది. ఎవరితో పొత్తులో వుందో తెలియని అయోమయ పరిస్థితి. ఆ రోజు వికేంద్రీకరణకు సై, ఈ రోజు నై! మాట మీద నిలబడని పార్టీ.
ఈ మూడు పార్టీలు బాబూ జగ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టని ఈ పార్టీ జెండాలు ఉత్తరాంధ్ర ప్రజలు మొయ్యాల్సిన పని వుందా?
ఉత్తరాంధ్ర పార్టీ స్థానికుల పార్టీ. పార్టీ ముందున్న లక్ష్యం ఉత్తరాంధ్ర ఉనికిని కాపాడటం. ఉత్తరాంధ్ర వారికే విశాఖపట్నంలో రాజకీయ పట్టం.
గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి సరఫరా జరగాలన్నా, ఉత్తరాంధ్రను కబ్జాకోరుల నుండి కాపాడాలన్నా ఉత్తరాంధ్ర పార్టీ ని బలపరచి ఎన్నికల్లో గెలిపించడం ఉత్తరాంధ్ర ప్రజల ముందున్న ఏకైక మార్గం.
ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం జరుగుతుంది. సభ్యత్వ నమోదు మొదలవుతుంది. ఆశీర్వదించండి.
మీ విచక్షణే మా బలం!
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment