జై ఉత్తరాంధ్ర!
KCR గారు ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. BRS పార్టీకి మద్దత్తు పలికిన ప్రతి ఉత్తరాంధ్ర వారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా పరిగణింపబడతారు.
ఉత్తరాంధ్రవారి చెమటతో, విశాఖపట్నం (VUDA) డబ్బుతో నవీన హైదరాబాద్ నగరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర నుండి కూలికోసం వలస వెళ్లిన 26 కులాలని అన్యాయంగా వెనుకబడిన వర్గాల జాబితా నుండి తీసివేశారు. బిసి కమిషన్ సిఫార్సులు లేకుండా చట్ట వ్యతిరేక నిర్ణయం ద్వారా వేలాది మంది జీవితాలతో ఆడుకున్నారు. 2014 నుండి నష్టపోయారు. ఉత్తరాంధ్ర లో 50% ప్రజలు ఈ 26 కులాలకు చెందినవారు.
ఉత్తరాంధ్ర లో BRS జెండా పెట్టాలంటే తక్షణమే ఈ 26 కులాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని కోరుతున్నాము. ఈ తొమ్మిదేళ్లలో జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలి. అప్పటివరకు BRS పార్టీ జెండాలు ఉత్తరాంధ్ర లో పెట్టడానికి వీలు లేదు.
జై ఉత్తరాంధ్ర!
Comments
Post a Comment