జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్ర ప్రజలు
కష్ట జీవులు, శ్రమనే నమ్ముకుంటారు
అమాయకులు, అందర్నీ నమ్మేస్తారు
ఆధిపత్యం చెయ్యాలని చూడరు
మోసపోయామని తెలిస్తే తిరగబడతారు
ఉత్తరాంధ్రకి మోసం జరుగుతుందని ప్రజా బహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన పత్రికలు, టీవీలు వాటి బాధ్యతని విస్మరించాయా? స్థానిక రాజకీయ నాయకత్వం నిద్రలో వుందా?
30% బడ్జెట్ నిధుల కేటాయింపులు జరిగాయా? నిధులుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ నత్త నడక నడుస్తోందెందుకు? శ్రీకాకుళం నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు లేదు? బొబ్బిలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎందుకు కళకళలాడటం లేదు? ఆదివాసీ ప్రాంతం లో మంచి నీటి సౌకర్యం ఎందుకు లేదు?
ఉత్తరాంధ్ర ప్రజలని ఎవరు ప్రాతినిద్యం వహిస్తున్నారు?
విశాఖపట్నం నుండి MLAలగా MPలగా వలస వచ్చిన వ్యాపారులు ఎందుకు అవుతున్నారు? స్థానికులకు వీరు ఎలా ప్రతినిద్యం వహించగలరు? సుదీర్ఘంగా విశాఖపట్నం నగరానికి ఎన్నికలు ఎందుకు లేవు? స్థానిక కార్పొరేటర్లు వలస పక్షులకు పోటీ అవుతారనా? తిరగబడితే కాని ఇచ్చాపురం MLA సీట్ ఒక పార్టీ స్థానికునికి ఇవ్వలేదు.
శిలాఫలకాలేసి చేతులు దులిపేసుకున్నారు. ఉద్యోగం కల్పించే ఎన్ని సంస్థలు ఉత్తరాంధ్ర కి వచ్చాయి? విశాఖపట్నంలో భూములు కేటాయించిన సంస్థలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి? ఉత్తరాంధ్ర యువతీ యువకులను స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రాయలసీమ లో వున్న సంస్థల్లో కూలీలగా తీసుకెళుతున్నారు.
ఉత్తరాంధ్రకి నిధులు ఇవ్వలేదు
ఉత్తరాంధ్ర స్థానికుల ప్రాతినిద్యం తీసేసుకున్నారు
ఉత్తరాంధ్ర లో ఉద్యోగ కల్పన చెయ్యలేదు.
ఉత్తరాంధ్ర వనరుల కబ్జా చేస్తున్నారు
75 ఏళ్లలో ఒక్క ఉత్తరాంధ్ర బిడ్డని CM చెయ్యలేదు.
మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకుండాలి? ఎవరి పెత్తందారీ కోసం పని చెయ్యాలి? రాయలసీమ బిడ్డల్ని మనమెందుకు భుజాలమీద కూర్చోపెట్టుకోవాలి అని ఆలోచించారా?
మన ఉత్తరాంధ్ర బిడ్డలకి ఎందుకు ఆదరించడం లేదు?
ఉత్తరాంధ్ర బిడ్డలకి వాళ్ళమ్మలు పాలు పెట్టలేదా? ముద్దు మురిపెం చెయ్యలేదా? ఉత్తరాంధ్ర వీర గాధలు చెప్పలేదా? లేకా ఉత్తరాంధ్ర బిడ్డలు రాయలసీమవారు వేసిన బిస్కట్లకి బానిసలయ్యరా? లేకా వూడిగం చేద్దామని కంకణం కట్టుకున్నారా?
ఉత్తరాంధ్ర సమయం వచ్చింది. ఉత్తరాంధ్ర భవిష్యత్తుని ఉత్తరాంధ్ర ప్రజలే నిర్ణయించుకునే కాలం వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల ఓపిక అయిపోయింది. కాలం అన్నింటికంటే గొప్పది. కాల మహిమ ఉత్తరాంధ్ర సాధన దిశగా వుంది.
తాయిలాల కోసం బానిస బ్రతులు కావాలా?
లేకా
ఉత్తరాంధ్ర వనరుల సద్వినియోగం ద్వారా సంపాదన కావాలా?
కుటుంబాలు వదిలి వలస జీవితాలు కావాలా?
లేకా
స్థానికంగా ఉద్యోగాలు కావాలా?
ఉత్తరాంధ్ర ప్రజలు మార్పు కోసం ఒక అడుగు ముందుకెయ్యాలి. ఉత్తరాంధ్ర పార్టీ పది అడుగులు వేస్తుంది.
జై ఉత్తరాంధ్ర!
Comments
Post a Comment