జై ఉత్తరాంధ్ర!
26 ఉత్తరాంధ్ర కులాలను తిరిగి BC జాబితాలో చేర్చమని యిప్పటి వరకు న్యాయ పోరాటం చేశారు. కొంత ఫలితం వచ్చింది. కానీ ప్రభుత్వం న్యాయం చేసేటట్లు లేదు. 2018 ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఒట్టి చెయ్యి చూపించారు. 2023 ఎన్నికల ముందు కూడా కల్ల బొల్లి కబుర్లు చెబుతారు.
ఉత్తరాంధ్ర కులాల హక్కుల పరి రక్షణ రాజకీయ మార్గం ద్వారానే సాధ్యం. TDP గానీ YCP గానీ తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యలేదు. స్థానికంగా పోటీ చేసే పార్టీలు తెలంగాణ బీసీలను దూరం చేసుకోలేరు.
హైదరాబాద్ మరియు తెలంగాణాలో వున్న ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయ శక్తిగా ఎదగడానికి ఉత్తరాంధ్ర పార్టీ కృషి చేస్తుంది. BRS పార్టీ ఎన్నికల ముందే 26 కులాలని బీసీ జాబితా లో చేర్చేటట్లు ఒత్తిడి తెద్దాం.
జై ఉత్తరాంధ్ర
Comments
Post a Comment