ప్రెస్ నోట్/19.5.2023: పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు సమయాత్తం ,నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు.
ప్రెస్ నోట్/19.5.2023
జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్ర పార్టీ ఆవశ్యకత గురించిన కరపత్రం, ఉత్తరాంధ్ర పార్టీ అభివృద్ధి మరియు పాలనా విధాన ముసాయిదా పత్రం జత చేయబద్దాయి. ఉత్తరాంధ్ర పార్టీ ప్రత్యేక రాష్ట్రం సాధన దిశగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పాత నాలుగు జిల్లాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు మరియు 8 పార్లమెంట్ స్థానాలకు 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణం మరియు ఎన్నికలకు సమయాత్తం జరుగుతుంది. నీరు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలు.
1. ఉత్తరాంధ్ర పై శీతకన్ను: ఉత్తరాంధ్ర ప్రాంతానికి వివిధ శాఖల ద్వారా రావలసిన నిధులు రాలేదు. రోడ్లు, ఆరోగ్య వసతులు అధ్వాన్నం. ఈ ప్రాంతంలో వున్న నదులపై ఆనకట్టలు కట్టడంలో నిర్లక్ష్యం చేశారు. మిగతా ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టలు కట్టడం, భారీగా నిధులు కేటాయింపు జరిగాయి. ఉత్తరాంధ్ర లో నీరు లేక వ్యవసాయం దెబ్బ తిన్నది. రైతులు పొట్టపోషణ కోసం కూలీలుగా మారారు. వలసలు వెళ్లారు. వారి భూములు అన్యాక్రాంత మయినాయి.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తరాంధ్ర రాష్ట్రమే శరణ్యం.
2. నీటి ప్రాజెక్టలపై అశ్రద్ధ :
2009 లో మొదలెట్టిన ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి ప్రాజెక్ట్ నత్త నడక నడుస్తుంది. 2014 లో కృష్ణా బేసిన్ కి నీటిని అందివ్వటానికి పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని అఘామేఘాల మీద కట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని పోలవరం ప్రాజెక్ట్ కి ఇంటిగ్రేట్ చెయ్యలేదు.
ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలకి ఒక CE. మిగతా ప్రాంతంలో జిల్లాకొక CE. శ్రీకాకుళం లో సర్కిల్ ఆఫీస్ పెట్టి పోస్టులను మంజూరు చెయ్యలేదు.
3. మభ్యపెట్టే ధోరణి :
వంశధార ఎడమ ప్రధాన కాలువకు మరమ్మత్తుల కోసం బడ్జెట్ అడిగితే ప్రజలను మభ్యపెట్టడం కోసం బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి చేస్తుంది ప్రభుత్వం. ఆయన పేరున వున్న వంశధార ఎడమ ప్రధాన కాలువ తవ్వి 50 ఏళ్లవుతుంది. మరమ్మత్తుల కోసం నిధులు కేటాయింపులు లేవు. పలాస, వజ్రపుకొత్తూరు మరియు నందిగాం మండలాలకు అరకొర నీరు.
4. అరకొర నిధులు :
ఉత్తరాంధ్ర కి ఇచ్చిన నిధులు ఎన్ని? బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. కానీ నిధులు విడుదల చెయ్యరు. చివరిగా అ నిధులు వేరే ప్రాంతాలకు మల్లింపు.
ఉత్తరాంధ్ర నదులపై కట్టిన ఆనకట్టలు ఎన్ని? వాటి నిలువ సామర్ధ్యం ఎంత? మిగతా ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్ట్స్, నిలువల సామర్ధ్యం ఎంత?
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో గల సుమారు 8 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందించవలసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ సంబంధించి 5 వేల కోట్ల పనులు దశాబ్ద కాలంగా కేవలం టెండర్లు అగ్రిమెంట్లకే పరిమితమైనవే కానీ పనులు శూన్యం. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ నకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాకుండా ప్రక్క జిల్లాలో వుంచి దానికి ఇంచార్జ్ ని విజయవాడ ఇంజనీర్ గా ఉండడం శోచనీయం.
5. ఉపాధి కల్పన లేమి
ఉత్తరాంధ్ర లో ఉపాధి కల్పన చెయ్యకుండా ఇక్కడ వారిని కూలీలుగా ఇతర ప్రాంతాలకు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంస్థ కూడా ఉత్తరాంధ్ర లో పెట్టలేదు. సహకార రంగంలో వున్న అన్ని సంస్థలు మూతపడ్డాయి. చక్కెర, జానప నార, విద్యుత్ పంపిణి మొ. తెలుగుదేశం ప్రభుత్వం గానీ, వైసీపీ ప్రభుత్వం గానీ స్థానికంగా ఉపాధి కల్పించలేదు. ఉన్న గ్రానైట్ పరిశ్రమ మీద అధిక పన్నులు, అక్రమ లావా దేవీలు. ఇతర ప్రాంతం నుండి కార్మికుల దిగుమతి. స్థానికులకు మొండి చెయ్యి.
6.ఉత్తరాంధ్ర జల వనరున శాఖ ఇంజనీరింగ్ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల హరణ:
రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ అధికరణ 371D, మరియు ఆరు సూత్రాల ఫార్ములాను తుంగలో తొక్కి 2017 లో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్ర కి సంబందించిన 53 నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అన్యాయంగా డిమోట్ చేశారు. వీరి స్థానంలో ఇతర ప్రాంతాల వారికి అక్రమముగా లబ్ది చేకూర్చారు. గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఈ అక్రమ పదోన్నతులను రద్దుపరచి రాజ్యాంగము మరియు ప్రెసిడెన్సియల్ ఆర్డర్ ప్రకారము పదోన్నతులు కల్పించమని, 2 నెలలు లోపు అమలుపరచమని 2019 నవంబర్ నెలలో ఉత్తర్వులు ఇచ్చినారు. సుమారు 3½ సంవత్సరములు గడిచిన ఈ రోజు వరకు ఉత్తర్వులను వైసీపీ ప్రభుత్వం అమలు పరచలేదు.
ఉత్తరాంధ్ర ఇంజనీర్లు పదవులు కోల్పోవడంతో బాటు తగ్గిన జీతాలవల్ల ఆర్ధికంగా, మానసికంగా నష్టపోయారు. వీరి పదోన్నతి లేకపోవడం వలన క్రింది స్థాయిలోని పోస్ట్లు భర్తీ కావటం లేదు. ఉత్తరాంధ్ర నిరుద్యోగ ఇంజనీర్ల అవకాశాలను గండికొట్టారు.
ఈ అన్యాయాన్ని సరిదిద్దటంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వున్నది. ఎందుకంటే కోర్ట్ ఉత్తర్వులు అమలు చేస్తే రాయలసీమ వారికి అప్పనంగా వచ్చిన పదోన్నతులు పోతాయని. ఉన్నత స్థానాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ఇంజనీర్లను రాకుండా నిరోదించడం వీరి ఉద్దేశ్యం. ఉన్నత స్థానంలో వుంటే ఉత్తరాంధ్ర కు జరుగుతున్నా అన్యాయాన్ని ప్రశ్నిస్తారని భయంతో కోర్ట్ ఉత్తర్వుల అమలులో జాప్యం.
వీరి పదోన్నతి లేకపోవడం వలన క్రింది స్థాయిలోని పోస్ట్లు భర్తీ కావటం లేదు. ఉత్తరాంధ్ర నిరుద్యోగ ఇంజనీర్ల అవకాశాలను గండికొట్టారు. స్థానిక వైసీపీ నాయకులు కల్పించుకున్నా పరిస్థితి మారలేదు. ఉత్తరాంధ్ర జల వనరుల ఇంజనీర్లు నిరాశ నిస్పృహల్లో వున్నారు.
7. ఒడిశా ప్రభుత్వంతో లేని సత్సంబంధాలు :
వంశధార నది పై నేరెడి వద్ద బారేజ్ కట్టాలన్న ప్రయత్నం సఫలం కాలేడు. ఒడిశా ప్రభుత్వం తో అంగీకారంకి రాలేకపోవడానికి ప్రధాన కారణం పరస్పర లాభందయకం చేకూర్చాలేకపోవడం. మనకి నేరేడి బ్యారేజ్ వస్తే 20టీఎంసీ ల వంశధార నీరు ఉత్తరాంధ్ర ప్రజలు వాడుకోవచ్చు. ఒడిశా ప్రభుత్వం సీలేరు విద్యుత్ కేంద్రం దగ్గర టైల్ ఎండ్ లిఫ్ట్ ద్వారా 2-3 టీఎంసీల నీటిని వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరింది. దానికి ఒప్పుకోకపోవడానికి కారణంగా ఒడిశా గత 25 ఏళ్లగా నేరేడు బ్యారేజ్ కి అనుమతి ఇవ్వలేదు. వంశధార ట్రిబ్యునల్ ముందు సంవత్సరాల వాదనలు కోట్ల రూపాయల ఖర్చు తరువాత వెలువడిన ఉత్తర్వులపై ఒడిశా సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనాలోచిత చర్యలా లేక ఉత్తరాంధ్ర అవసరాలపై చిన్న చూపా?
8.ఉత్తరాంధ్ర భూములు అన్యాక్రాంతం:
నిధుల కొరత, నియామకాలు లేక, నిరాశ్యంలో ఉత్తరాంధ్ర నీటి పారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం అయింది. వ్యవసాయాన్ని దెబ్బ తీశారు. ప్రజలు వలసల బాట పట్టారు. ఈ ఒరవడి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పుంతలు తొక్కింది. విజయనగరం జిల్లాలో సగంకి పైగా భూములు ఇతర ప్రాంతాల వారి అదీనంలోకి పోయాయి. రైతులు పాలేర్లు అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయానికి కావలసిని నీటిని ఇవ్వడంలో పూర్తిగా విఫలం అయ్యింది.
9. ఉత్తరాంధ్ర ప్రజల ముందున్న మార్గం - కొత్త రాష్ట్రం :
కొత్త రాష్ట్రం ద్వారానే అభివృద్ధి సాధ్యం. ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఉత్తరాంధ్రను అన్యాయం చేసిన తెలుగుదేశం మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లను 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. ఉత్తరాంధ్ర పార్టీని అఖండ మెజారిటీ తో గెలిపించాలి.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment