ఉత్తరాంధ్ర పార్టీ విధానపత్రం (ముసాయిదా )
జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్ర పార్టీ ప్రధాన లక్ష్యం ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన. రాష్ట్రం సాధన ద్వారా ఉత్తరాంధ్ర లో వున్న వనరులని సద్వినియోగం చేసి వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ప్రగతి మార్గంలో నడిపించగలం. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం మనం అవలంబించే విధానాలు.
1.ఉత్తరాంధ్ర అభివృద్ధి నమూనా
ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని మూడు జోన్లగా విభజన.
సముద్ర తీరం - బ్లూ ఎకానమీ - మత్స్య సంపద, విహార/పర్యాటక రంగం, సముద్ర యానం, సినిమా పరిశ్రమ, మొ.
పర్వత /అటవీ ప్రాంతం - గ్రీన్ ఎకానమీ - పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వ్యవసాయ రంగం, విహార/పర్యాటక రంగం, సినిమా పరిశ్రమ, విద్యాలయాలు, వైద్య రంగం, సేవా రంగం, మొ.
మైదాన ప్రాంతం - రెడ్ ఎకానమీ - వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, సేవా రంగం, రవాణా రంగం, మొ.
2. పరిపాలనా విధానం
ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వుండేటట్లు వ్యవస్థను పునర్నిర్మాణం చేయబడును.
a) అన్ని పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా పునరవ్యవస్తీకరణ. మండల తసీల్దార్లు నేరుగా జిల్లా కలెక్టరుకు రిపోర్ట్ చేస్తారు.
b) వ్యవసాయ భూమికి సంబందించిన అన్ని లావాదేవీలు మండల తాసిల్దార్ కార్యాలయంలో జరుగును. మిగతా ఆస్తుల లావాదేవీలు రిజిస్ట్రేషన్ విభాగం చూసుకొంటుంది.
c) ప్రతి లక్ష మంది ప్రజలకు 333 మంది పోలీసుల నియామకం.
d) బంగళాలకు స్వస్తి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఫ్లాట్లలో వుంటారు.
e) పాత పెన్షన్ విధానము పునరుద్దరణ (కొన్ని మార్పులతో )
f) అవినీతి కట్టడి కోసం సత్వర చర్యలు.
g) ప్రభుత్వ విభాగల్లో వున్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీ.
3. వ్యవసాయ విధానం
ఉత్తరాంధ్ర నదుల నీటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి వినియోగం.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లలో మన వాటాను సాధించి ఉత్తరాంధ్రలో ప్రతి సెంటు భూమిని తడిపి సస్యశ్యామలం చేస్తాం.
పంట నిల్వకు గిడ్డంగులను నిర్మించి, కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు. మార్కెటింగ్ సదుపాయాలను కల్పన.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కల్పన. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుట. వాణిజ్య పంటల అభివృద్ధి కోసం పసుపు, మిరప , జ్యూట్ బోర్డులను ఏర్పాటు.
రైతులు మరియు భూయజమానులు వ్యవసాయం చేయుటకు వీలుగా వ్యవసాయ విభాగం పర్యవేక్షణలో ప్రభుత్వ సంస్థల ద్వారా దున్నడం, కొయ్యడం, నూర్చడం మొ. పనులు చేయుట, విత్తనాలు, ఎరువులు, కలుపు, తెగులు నివారణ మందులు, సాగు నీటి సప్లై మొ. చేయడం జరుగుతుంది. పంట ప్రభుత్వ సంస్థ కొని పైన చేసిన పనులకు ఖర్చు మినహాహించుకొని మిగతా దాన్ని రైతు/భూ యజమానులకు చెల్లిస్తుంది. కూలీలకు కూలీ కూడా ప్రభుత్వ సంస్థ చెల్లించి రైతు పంట నుండి మినహాయింపు. రైతు వ్యవసాయ యాజమాన్యం చూసుకుంటే సరిపోతుంది.
4. పారిశ్రామిక విధానం
విశాఖపట్నం రాజధానిగా, ప్రజా నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడం.
శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ మరియు రాజమండ్రి నగరాలను మెట్రో పాలిటన్ నగరాలుగా, విద్య ,వైద్య, ఉపాధి కల్పనా కేంద్రాలుగా తీర్చదిద్దడం.
మిగిలిన జిల్లా ముఖ్యపట్టణాలలో ఆధునిక వసతులు కల్పించి ఉపాధి కల్పనకు మార్గం సుగమం చెయ్యడం.
ప్రత్యేక పారిశ్రామిక నడవాల అభివృద్ధి. పరిశ్రమల ఏర్పాటు ద్వారా వలసలను అరికట్టడం
ఉత్తరాంధ్ర ప్రజలకు ఉద్యోగ కల్పన చేయడం కోసం ఉత్తరాంధ్ర పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహకాల నిమిత్తం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5000 కోట్ల రూపాయిల కేటాయింపు.
జిల్లా పారిశ్రామిక కేంద్రాలను బలోపేతం చేయడం.
వ్యవసాయ మరియు ఉద్యాన పంటల, సముద్ర ఉత్పత్తుల నిలువ మరియు ప్రాసెసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చెయ్యడం.
పారిశ్రామీకరణ విభాగలాన్నింటికీ ఒకే మంత్రిత్వాశాఖ.
పరిశ్రమలకు విద్యాలయాలకు వారధి ఏర్పాటు.
5. ఆరోగ్య విధానం
ఉత్తరాంధ్ర పార్టీ ఆరోగ్యాన్ని ప్రాధమిక హక్కుగా (జీవించే హక్కు) భావిస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్ని కార్పోరేట్ ఆసుపత్రి స్థాయి తీర్చిదిద్ది, అన్ని రకాల అధునాతన వైద్య సేవల్ని ఉచితంగా అందించడం.
ప్రభుత్వ వైద్యాలయాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులగా రూపుదిద్దేవరకు ప్రజలకు మెరుగైన ఉచిత ఆరోగ్య పథకం కొనసాగింపు.
వైద్యుల, వైద్య సిబ్బంది సంఖ్యను మరియు ఆరోగ్య శాఖ బడ్జెట్ గణనీయంగా పెంపు.
6. విద్యా విధానం
అంగన్వాడీ నుండి 12 వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందరికీ ఉచితంగా. ఈ విభాగంలో వున్న ప్రైవేట్ విద్యాలయాల రద్దు. సంస్థలకు, వాట్లో పని చేసే వారికి తగు ఉపశమన చర్యలు.
డిగ్రీ మరియు పీజీ చదివేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో సౌకర్యం. పేద విద్యార్థులకు తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం.
ఉత్తరాంధ్ర లో రీసెర్చ్ కి పెద్దపీట.
7. మహిళాశక్తి విధానం
ఉత్తరాంధ్ర పార్టీ మహిళా సాధికారత కి కట్టుబడి వుంది. అన్ని రాజకీయ పదవుల్లో 50% మహిళలకు కేటాయింపు.
స్వయం సహాయక సంఘాలను వస్తువులు మరియు సేవల ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చి దిద్దడం.
8. యువశక్తి విధానం
21 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు దేశ ఆదాయం పెంచేందుకు తీర్చి దిద్దడం.
9. సంక్షేమ విధానం
రూపాయికి కేజీ బియ్యం కోసం ఎదురు చూడకుండా మార్కెట్ ధరకి కొనగలిగే శక్తి సామాన్య ప్రజలకుండేటట్టు ఉత్తరాంధ్ర పార్టీ పని చేస్తుంది.
ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరిని కొనుగోలు శక్తిని పెంచుతాం.
రైతాంగం లాభసాటి అయ్యేటట్టు
యువత వ్యాపారం చేసేటట్టు మరియు ఉద్యోగకల్పన చేసేటట్టు విధానాలు వుంటాయి.
ఏ విధంగా కూడా కొనుగోలు శక్తి పెరగని వారికి సంక్షేమ పధకాలు వుంటాయి. కొనుగోలు శక్తి పెరిగే వరకు తగు సహాయం అందిస్తుంది.
జై జై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment