ఉత్తరాంధ్ర రాష్ట్రం అన్న చర్చాంశం నుండి ఉత్తరాంధ్ర పార్టీ ఎన్నికలు ఎలా గెలుస్తుంది అన్నది చర్చాంశం ఇప్పుడు. ఇంత తక్కువ సమయంలో 53 MLA మరియు 8 MP స్థానాలను ఎలా గెలుస్తుంది అన్నది ప్రశ్న? ఇంకా మరి కొన్ని ప్రశ్నలు :
* ఈయనేమీ NTR కాదు కదా, 9 నెలల్లో గెలవటానికి!
* ఆయనకి ప్రచారం చేసినట్టు ఈయనకి ప్రచారం చేసే పత్రికేది?
* 2023/24 లో గెలవడం 1982/83 అంత సులువు కాదు. ధన ప్రభావం అంటున్నారు?
సమర్ధించే వారి సమాధానాలు :
* అప్పుడు NTR 294 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు 53 స్థానాల్లోనే చేస్తున్నారు. మన పని 18% మాత్రమే. అప్పుడు నాలుగు ప్రాంతాల్లో తిరిగారు. ఇప్పుడు ఒక్క ప్రాంతమే. అంటే తిరగాల్సింది 25% మాత్రమే.
* అప్పుడు పత్రిక కొద్ది మందికే చేరేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో ఎలక్ట్రానిక్ పత్రిక వుంది. క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి వ్యక్తి ఒక పాత్రికేయుడిప్పుడు.
* NTR ది అపూర్వ వ్యక్తిత్వం. మరి ఉత్తరాంధ్ర పార్టీ నాయకత్వం వహించే వ్యక్తి లాంటి వారు ఇటీవలి కాలంలో రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం సాధించారు. కాలం కొత్తతరహా నాయకత్వం కోరుతుంది.
* ధన ప్రవాహానికి తలవంచని పంజాబ్ ఓటర్లు దేశానికీ ఇప్పుడు దిక్చూసి. ఆత్మాభిమానానికి ప్రతీక అయిన ఉత్తరాంధ్ర ప్రజలు డబ్బుకు దాసోహం కారు.
ఉత్తరాంధ్ర పార్టీని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు?
* ఉత్తరాంధ్ర ఉనికిని కాపాడటం కోసం
* ఉత్తరాంధ్ర కి గోదావరి నీరు తేవడానికి
* ఉత్తరాంధ్ర నుండి వలసలు తగ్గించడానికి
* ఉత్తరాంధ్ర వారే ప్రజా ప్రతినిధులు కావటానికి
* ఉత్తరాంధ్ర సంస్కృతిని కాపాడుకోవటానికి
2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పార్టీ విజయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి.
ఉత్తరాంధ్ర జెండాలు ప్రతి ఇంటి మీద ఎగరాలి. గుండె నిండా ఆత్మ విశ్వాసం నిండాలి. ఉత్తరాంధ్ర ప్రపంచ కర్మాగారం కావాలి. మన వస్తువులు విశ్వమోహనం అవ్వాలి.
Comments
Post a Comment