జై ఉత్తరాంధ్ర!
ఉత్తరాంధ్రకి గత 70 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని
1. మన ప్రాంత రాజకీయ నాయకులు ప్రశ్నించలేదు. పార్టీ విధేయత, రాజకీయ ఎదుగుదల, మొ. కారణమేమో! ఉత్తరాంధ్ర వారి నాయకత్వంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేకపోవడం మాత్రం ప్రధాన కారణం.
2. ఒక్క పత్రిక గానీ, టీవీ ఛానల్ గానీ గట్టిగా ప్రజలకి తెలియజేయలేదు. మన ప్రాంతం నుండి పత్రిక, టీవీ సంపాదకీయం లేకపోవడం కారణమా?. ఉత్తరాంధ్ర ప్రజల యాజమాన్యంలో ఒక్క పత్రికగానీ టీవీగానీ లేకపోవడం మాత్రం ప్రధాన కారణం.
3. అభివృద్ధి చెందిన ఉత్తరాంధ్ర జనాలు వారి సుఖ సంతోషాలు కోసం వారి రిటైర్మెంట్ జీవితాన్ని నగరాల్లో గడపడం కారణమేమో! అభివృద్ధి చెందిన ఉత్తరాంధ్ర వాసులు పుట్టిన గడ్డని విస్మరించడం మాత్రం ప్రధాన కారణం.
ఉత్తరాంధ్ర గొంతుకగా ఉత్తరాంధ్ర పార్టీ వచ్చింది.
ఉత్తరాంధ్ర కి జరిగిన అన్యాయం గురించి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి ఉత్తరాంధ్ర చిన్న పత్రికల వారు ఒక దిన పత్రిక పెట్టలేరా? చిన్న ఎలక్ట్రానిక్ చానెల్స్ వున్న వారు కలిసి రెగ్యులర్ TV ఛానల్ పెట్టలేరా? యిది జరగాలి.
ఉత్తరాంధ్ర వనరులతో పెద్దవాళ్ళై పదవీ విరమణ చేసిన ఉత్తరాంధ్ర వారు ఉత్తరాంధ్ర పల్లెలకి తిరిగి రావాలి. వారి ఆర్ధిక, యజమాన్య అనుభవం జోడించి ఉపాధి అవకాశాలు పెంచాలి. చివరికి పుట్టిన గడ్డ మట్టిలో కలవాలి.
బయటి వారు మనల్ని ఉద్ధరిస్తారనే భ్రమ పోవాలి. మన శక్తి మీద మనకి నమ్మకం రావాలి. అప్పుడే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. వలస పోకలు తగ్గుతాయి.
జైజై ఉత్తరాంధ్ర!!
Comments
Post a Comment