అందరికీ విజయం! తొందర్లో అమరావతి కడతానన్న బాబు గారి కల సాకారమై అది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవుతుంది! విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాష్ట్రానికి రాజధాని అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు నిర్ణయాధికారం వస్తుంది. గోదావరి నీరు బహుదా నదికి చేరుతుంది రాయలసీమ రాష్ట్రానికి కర్నూల్ రాజధాని అయి శ్రీబాగ్ ఒప్పందము ఒకరకంగా అమలవుతుంది. జగన్ గారు ప్రతిపాదించిన మూడు రాజధానులను ప్రజలు మూడు రాష్ట్రాలు అయితే ముచ్చటగా ఉంటుందని భావిస్తున్నారు. బాబు గారి అమరావతి నగరం, జగన్ గారి మూడు రాజధానుల అంశం, ప్రజల చిరకాల వాంఛ మూడు రాష్ట్రాల ద్వారా నెరవేరుతాయి. ఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వం సమావేశాల్లో నలుగురు తెలుగు ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం వుంటుంది. ఢిల్లీలో తెలుగువారి ప్రాభావం పెరుగుతుంది. ఏ స్పెషల్ స్టేటస్ లేకుండా నాలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా వెళ్తాయి. ఇక్కడ వనరులు ఉపయోగించి భవిష్యత్ ను నిర్మించగలం. కలిసి వుంటే రాజకీయం, ఆందోళనలు, అభద్రత, మొ. వుంటాయి. స్నేహపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు, మూడు రాజధానులు అయినప్పుడు మనమందరం విజయం సాధించినట్టే. మూడు రాష్ట్రాలు ప్రపంచంలో 50 దేశాల కంటే పెద్దవి. భారత దేశంలో 10 రా...
Support statehood for UttarAndhra, the resource-rich dirt-poor neglected part of the Telugu region.