Skip to main content

Posts

Showing posts from March, 2023

Shri T Dharma Raju, educatiinalist and resident of Sompeta has been nominated as UttarAndhra Party Sompeta Mandal Coordinator

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! సోంపేట నివాసి మరియు విద్యావేత్త శ్రీ T ధర్మరాజు గారు ఉత్తరాంధ్ర పార్టీ  సోంపేట మండల సమన్వయకర్తగా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం  Shri T Dharma Raju, educatiinalist and resident of Sompeta has been nominated as UttarAndhra Party Sompeta Mandal Coordinator. Pl wish him all success. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

Smt G Manjula, an Entrepreneur and resident of Srikakulam city has been nominated as UttarAndhra Party Srikakulam District Coordinator.

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! శ్రీకాకుళం నివాసి మరియు వ్యాపారవేత్త అయిన శ్రీమతి G మంజుల గారు ఉత్తరాంధ్రపార్టీ  శ్రీకాకుళం జిల్లా సమన్వయకర్తగా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం  Smt G Manjula, an Entrepreneur and resident of Srikakulam city has been nominated as UttarAndhra Party Srikakulam District Coordinator. Pl wish her all success. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

Shri K Muralidhar nominated as UttarAndhra Party Vizianagaram Coordinator.

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! విజయనగరం నివాసి మరియు న్యాయవాది అయిన శ్రీ K మురళీధర్ గారు ఉత్తరాంధ్రపార్టీ  విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం  Shri K Muralidhar, a resident of Vizianagaram city and Advocate has been nominated as UttarAndhra Party Vizianagaram Coordinator. Pl wish him success. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

Shri P Appalanaidu: Nominated as UttarAndhra Party Narasannapeta Assembly Constituency Coordinator

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! జలుమూరు మండల నివాసి, ఇంజనీర్ మరియు వ్యాపావేత్త శ్రీ P అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్రపార్టీ నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం  Shri P Appalanaidu, a native of Jalumuru Mandal, an Engineer and Entrepreneur has been nominated as UttarAndhra Party Narasannapeta Assembly Constituency Coordinator. Pl wish him success. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

ఉత్తరాంధ్ర లో అన్ని నదుల ద్వారా ఎంత నీరు అందించారు?

జై ఉత్తరాంధ్ర! రాయలసీమకి నీరు లేదని అంటారు! వాస్తవాలు చూస్తే గత 20 ఏళ్లగా ఒక్క కృష్ణ నది నుండే 56.57 టీఎంసీల నుండి 179 టీఎంసీల నీరు అందించారు. మరి ఉత్తరాంధ్ర లో అన్ని నదుల ద్వారా ఎంత నీరు అందించారు? 10 టీఎంసీ, 20 టీఎంసీ, 30 టీఎంసీ?     ఉత్తరాంధ్ర లో పెద్ద ప్రాజెక్ట్ వంశధార! మరి 2022-23 లో దాని సామర్ధ్యం 8 టీఎంసీ నీరు. ఉత్తరాంధ్ర వ్యవసాయం ఎందుకు కుంటుపడిందో, వలసలు ఎందుకు ఎక్కువవుతున్నాయో ఉత్తరాంధ్ర ప్రజలకు దీనిబట్టి అర్ధం అవ్వాలి. గోదావరి నీటిని ఉత్తరాంధ్ర కి ఇచ్చే బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని అశ్రద్ధ చేసిన రాయలసీమ నాయకత్వం లోని పార్టీలను ఓడిస్తే గానీ ఉత్తరాంధ్రకి పట్టిన శని వదలదు. జై జై ఉత్తరాంధ్ర!!

Smt E Srilakshmi, a resident of Arilova and an Educationalist has been nominated as UttarAndhra Party Visakhapatnam City Coordinator

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఆరిలోవ  నివాసి మరియు విద్యావేత్త శ్రీమతి  E శ్రీలక్ష్మి గారు ఉత్తరాంధ్ర పార్టీ విశాఖపట్నం నగర కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. వారిని ఆశీర్వదించ కోరుతున్నాం  Smt E Srilakshmi, a resident of Arilova and an Educationalist has been nominated as UttarAndhra Party Visakhapatnam City Coordinator. Pl wish her success. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai Uttarandhra!!

LAND GRABBING: UttarAndhra Party demands action on these SIT reports

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! విశాఖ భూముల కబ్జాపై విచారణ నిమిత్తం రెండు పార్టీల ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని (SIT) నియమించాయి. అవి తమ రిపోర్ట్లను ప్రభుత్వాలకి అందించాయి. ఇంతవరకు చర్యలు నిల్. Governments of these two political parties appointed Special Investigation Teams (SIT) to enquire grabbing of lands in Visakhapatnam. They submitted reports as well, however, so far no action was taken.  ఈ రాయలసీమ నాయకుల ప్రభుత్వాలు ఎవరిని చట్టాన్నుండి కాపాడుతున్నాయో ఉత్తరాంధ్ర ప్రజలకు అర్ధమవ్వాలి. ఉత్తరాంధ్రని కబ్జా చెయ్యడంలో  ఈ రెండు పార్టీలు పోటీలో వున్నాయి. UttarAndhra people should understand that these governments led by Rayalaseema leaders are protecting culprits from the law. These two political parties are competing to grab UttarAndhra. ఉత్తరాంధ్ర పార్టీ SIT రిపోర్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. UttarAndhra Party demands action on these SIT reports. జై జై ఉత్తరాంధ్ర!! Jai Jai UttarAndhra!!

ఉత్తరాంధ్ర పార్టీ నిర్మాణం జరుగుతుంది. సభ్యత్వ నమోదు మొదలవుతుంది. ఆశీర్వదించండి.

జై ఉత్తరాంధ్ర! నిర్లక్ష్యపు నీడలో వున్న ఉత్తరాంధ్రని మోసం చేసింది 40 ఏళ్ల పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం ఒక కుటుంబానికి తాకట్టు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా త్రోసిరాజని కొత్త నగరం నిర్మించదలసి బోర్లా పడ్డారు. మొదటినుండి అన్నింటినీ రాజకీయం చేసిన 11 ఏళ్ల పార్టీ పాలన చేతకాక ఓట్లను ఆకర్షించడంలో బిజీ బిజీ. మూడు రాజధానులని రాజకీయ క్రీడ చేశారు. బటన్ నొక్కడం తప్ప వేరే ప్రభుత్వ కార్యక్రమం లేదు. అసలు పార్టీ నిర్మాణమే తెలియని ఇంకో పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దిక్కు తోచని స్థితిలో వుంది. ఎవరితో పొత్తులో వుందో తెలియని అయోమయ పరిస్థితి. ఆ రోజు వికేంద్రీకరణకు సై, ఈ రోజు నై! మాట మీద నిలబడని పార్టీ. ఈ  మూడు  పార్టీలు బాబూ జగ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టని ఈ పార్టీ జెండాలు ఉత్తరాంధ్ర ప్రజలు మొయ్యాల్సిన పని వుందా?  ఉత్తరాంధ్ర పార్టీ స్థానికుల పార్టీ. పార్టీ ముందున్న లక్ష్యం  ఉత్తరాంధ్ర ఉనికిని కాపాడటం. ఉత్తరాంధ్ర వారికే విశాఖపట్నంలో రాజకీయ పట్టం. గోదావరి నీటిని ఉత్తరా...

మన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జై ఉత్తరాంధ్ర! మన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేముడికి మొక్కుతున్నాము కదా అని చదువుని అశ్రద్ధ చేస్తే మంచిఫలితం యివ్వడం ఆ దేవునికి కూడా సాధ్యం కాదు. నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన కేంద్రం చట్టపరంగా కొన్ని వాగ్దానాలను చేసింది. వాటన్నిటినీ ఎగ్గొడుతున్నా పట్టించుకోకుండా మనం ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులు వాళ్ళలో వాళ్లు నిత్యం దెబ్బలడుకొంటూ, మన ఉత్తరాంధ్ర అభివృద్ధి ని పూర్తిగా మరచిపోయారు. శోభ కృత నామ సంవత్సరం లో శుభం కలగాలని మనం లాంఛనంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు... ఈ తెలుగు సంవత్సరాది సందర్భంగా నైనా ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏం చేస్తే కాపాడ బడతాయో ఆలోచించి చైన్యవంతులుగా ముందుకు కదలడానికి సిద్ధపడాలి.. అప్పుడే మనకు నిజమైన ఉగాది.. అభినందనలతో.. ఉత్తరాంధ్ర పార్టీ !

ఉత్తరాంధ్ర ఇంక ఇతరుల పార్టీలని నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేదు

జై ఉత్తరాంధ్ర! Jai UttarAndhra! ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా దగా పడుతుంది. ఇంక ఇతరుల పార్టీలని నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేదు. మన ప్రాంతం వారి పార్టీ ఉత్తరాంధ్ర పార్టీ. ఆదరిద్దాం మన పార్టీని, మన నాయకత్వాన్ని! UttarAndhra has been cheated for decades. No longer we trust parties of other people and continue cheated. UttarAndhra Party is of UttarAndhra people. Let us patronise our party ond our leadership! వ్యవసాయం వృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగ కల్పన జరిగి వలసలు ఆగాలన్నా, రావాలి మన ప్రభుత్వం, ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. To develop agriculture, to set up industries, to provide employment and arrest migration, we should have our government i. e UttarAndhra State Government. జై జై ఉత్తరాంధ్ర! Jai Jai UttarAndhra!!

No dams on UttarAndhra rivers and lakes are encroached upon

జై ఉత్తరాంధ్ర! ఉత్తరాంధ్రలో చెరువులు వ్యవసాయానికి ఆయువు. దురదృష్టం ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ చెరువులు ఆక్రమణ గురి అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం. అధికారులు చూసి చూడనట్లు ఉండటానికి కారణం కబ్జాదార్లకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు. ప్రభుత్వం తలచుకుంటే ఆక్రమణలు తొలగింపు కష్టం కాదు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడానికి కారణం వారి వారి పార్టీ నాయకులకు నష్టం కలగకుండా ఉండటానికే. నదులపై ఆనకట్టలు లేవు. చెరువులు అన్యాక్రాంతం. ఫలితంగా వ్యవసాయం కుదేలు. వలసలు పెరిగాయి. ఉత్తరాంధ్ర భూములు పరాయి వారు కారు చవకగా కొట్టేసారు. ఉత్తరాంధ్ర దుస్థితికి మూల కారణమైన పాలకులను గద్దె దించాలి. రాయలసీమ నాయకత్వంలోని పార్టీలను ఉత్తరాంధ్ర నుండి తరిమేస్తే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదు. తరిమే కార్యక్రమం ఉత్తరాంధ్ర పార్టీ మొదలెట్టింది. మీరంతా ఇతోధికంగా సాయం చెయ్యండి. జై ఉత్తరాంధ్ర! జై జై ఉత్తరాంధ్ర!! Jai UttarAndhra! Ponds and lakes are very important for agriculture in UttarAndhra. Unfortunately, these lakes are encroched upon since few decades. Negligence of Government ...

BRS పార్టీకి మద్దత్తు పలికిన ప్రతి ఉత్తరాంధ్ర వారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా పరిగణింపబడతారు.

జై ఉత్తరాంధ్ర! KCR గారు ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. BRS పార్టీకి మద్దత్తు పలికిన ప్రతి ఉత్తరాంధ్ర వారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా పరిగణింపబడతారు. ఉత్తరాంధ్రవారి చెమటతో, విశాఖపట్నం (VUDA) డబ్బుతో నవీన హైదరాబాద్ నగరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర నుండి కూలికోసం వలస వెళ్లిన 26 కులాలని అన్యాయంగా వెనుకబడిన వర్గాల జాబితా నుండి తీసివేశారు. బిసి కమిషన్ సిఫార్సులు లేకుండా చట్ట వ్యతిరేక నిర్ణయం ద్వారా వేలాది మంది జీవితాలతో ఆడుకున్నారు. 2014 నుండి నష్టపోయారు. ఉత్తరాంధ్ర లో 50% ప్రజలు ఈ 26 కులాలకు చెందినవారు. ఉత్తరాంధ్ర లో BRS జెండా పెట్టాలంటే తక్షణమే ఈ 26 కులాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని  కోరుతున్నాము. ఈ తొమ్మిదేళ్లలో జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలి. అప్పటివరకు BRS పార్టీ జెండాలు ఉత్తరాంధ్ర లో పెట్టడానికి వీలు లేదు. జై ఉత్తరాంధ్ర!